
హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై ఎంఎల్‌ఎ మందు సామేలు తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఎవరూ టికెట్ ఇప్పించలేదని, తుంగతుర్తి ఎంఎల్‌ఎ టికెట్ తన చేతిలో, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఉండదని, కాంగ్రెస్ అధిష్ఠానం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చారని తెలిపారు. తనను ఎవరూ గెలిపించలేదని, కాంగ్రెస్ పార్టీ గెలిపించిందని తెలియజేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి తప్పు చేశామని తన అభిమానులు అనుకుంటున్నారని, తాను ఎన్నోసార్లు మంత్రిని కలిసినా రోడ్డు ఇవ్వలేదని మందుల సామేల్ ధ్వజమెత్తారు. సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గం ఎలా వస్తారని ప్రశ్నించారు. మంత్రి వచ్చినప్పుడు అటెండర్‌తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడినని, తన నియోజకవర్గం విషయంలో ఇన్వాల్వ్ కావొద్దని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినా కూడా వినడం లేదన్నారు. నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి రాజ్యం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తన గురించి హీనంగా మాట్లాడుతున్నారని, వీరేశం, తనని ప్రజలు 50,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గాలు బాగోలేవని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని, అసులు మునుగోడు సంగతికి చూసుకోవాలని చురకలంటించారు. మునుగోడులో అభివృద్ధి జరగలేదని రిపోర్టు వచ్చిందని ఎద్దేవా చేశారు.











