హైదరాబాద్: తనకు, సిఎం రేవంత్‌ రెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు. గురువారం గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్‌, తాను రోజూ ఫోన్‌ల్లో మాట్లాడుకుంటామని ఆయన అన్నారు. నిన్న కూడా సిఎంతో ఫోన్లో మాట్లాడానని ఆయన తెలిపారు. కో ఆర్డినేషన్ కమిటీకి అన్ని చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదన్నారు. తాము సిఎంను గౌరవిస్తామని పిసిసి అధ్యక్షుడు స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని.. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని పిసిసి అధ్యక్షుడు తెలిపారు.