అమరావతి: చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి లక్ష్యం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెత్త పేరుకోవడం వల్ల అనేక రోగాలు వస్తాయని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సిఎం పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎన్టిఆర్ గ్రౌండ్ లోని ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని, మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్వీన్ స్వీప్ కార్యక్రమం పెట్టామని తెలియజేశారు. చాలామంది ఆపరేషన్ క్వీన్ స్వీప్ లో పాల్గొన్నారని, ఇంట్లో ఎవరికి వారే తడి, పొడి చెత్తలను వేరు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తడి, చెత్తను కంపోస్ట్ గా తయారు చేసుకోవాలని, 12 ఏళ్ల ముందు కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చేవి కావని అన్నారు. కృష్ణా జిల్లా దేశానికి అన్నం పెట్టిన స్థలం అని కవుల నుంచి హీరోల వరకు ఎంతో మంది ఈ గడ్డ మీద పుట్టిన వారేనని పేర్కొన్నారు. 12 ఏళ్లలో ఎంతో కృషి చేసి పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు నీరు తెచ్చామని, వానలు లేక ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదులన్ని అనుసంధానం చేస్తామని..కరువు లేకుండా చేస్తామని, రూ.1.50 లకే కరెంట్ ఇచ్చిన ఘటన టిడిపి అని అన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని, అక్వా రంగానికి అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.