మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన మంగళవారం (మే 12) మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ని ర్వహించనున్నారు. ఇటీవల బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీ సుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మా ణం, సభ్యత్వ నమోదు, జిల్లాలు, శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలిపక్షాల ఉప నా యకులు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.