నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.జిల్లాలోని పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని గడ్డి మందు తాగింది. గమనించి కుటుంబసభ్యులు వెంటనే చికిత్స  నిమ్స్ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని వైష్ణవి తండ్రి రాజయ్య తెలిపారు.