
ప్రముఖ ఒటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన ఆంథాలజీని (షార్ట్ ఫిలిమ్స్ సమాహారం) ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. గతంలో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘లస్ట్ స్టోరీస్ 3’ రూపొందింది. ప్రముఖ నటులు సిద్ధార్థ్, అదితీరావ్ హైదరీ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్ తదితరులు నటించిన ఈ ఆంథాలజీ సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సమకాలీన్ సమాజంలో ప్రేమ, వాంఛ, అనుబంధాల్లోని విభిన్న కోణాలను ఆవిష్కరించేలా వీటిని రూపొందించారు. ఈ ‘లస్ట్ స్టోరీస్ 3’ కోసం ప్రముఖ దర్శకులు విక్రమాది్తయ మొత్వానే, కిరణ్ రావ్, శకున్ బత్రా, విశాల్ భరద్వాజ్లు నాలుగు షార్ట్ ఫిలిమ్స్ని తెరకెక్కించారు.











