నగరంలో శుక్రవారం సాయంత్రం పలు చోట్ల ఒక మోస్తరు భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన అశోక్‌నగర్, దోమల్‌గూడ,చిక్కడ పల్లి, ముషీరాబాద్, రామ్‌నగర్, విద్యానగర్,బేగంపేట, జూబ్లీహిల్స్ ,ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లోనే కాకుండా శివారు ప్రాంతాలైన మేడ్చెల్, అమీన్‌ఫురా,బాచుపల్లి, నిజాంపేట, అల్వాల్, మణికొండ, రాజేంద్రనగర్, శంషాబాద్, బార్కస్,బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. దీంతో రహదారులుపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాక పోకలు, ఇబ్బంది కలిగింది. ప్రైవేట్, ప్రభుత్వ, కార్యయాల్లో తమ విధులు ముగించకుని ఇళ్ళకు వెళ్ళేవారు వర్షపు నీటిలో తడిచి ముద్దయ్యారు. వర్షం కారణంగా కొంత మంది ఫ్లై ఓవర్లు, మెట్రో ఫ్లై ఓవర్ల కింద నిలబడి వర్షం బారిన పడకుండా తమకు తాము కాపాడుకున్నారు.

అయితే పెద్ద సంఖ్యలో ఫ్లై ఓవర్లు కింద వాహనదారులు తమ వాహనాలను పార్క్ చేయడంతో ఆయా ప్రాంతాల గుండా వెళ్ళే ఇతర వాహనదారులు ఇబ్బంది పడటమే కాకుండా, ట్రాఫిక్ సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో విద్యుత్ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.అల్పపీడన ప్రభావంతో నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని ఇదే పరిస్థితి నెలకొంటుందని, ఇప్పటికే వాతావరణశాఖ ముందస్తు హచ్చరిక జారీ చేసింది. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు ఉంటుందని తన ప్రకటనలో పేర్కొంది.దీంతో పలు శాఖ అధికారులు కూడా భారీ వర్షం పడితే ఎలా వ్యహరించాలా ఇప్పటికే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పోలీసు అధికారులు అత్యవసరం ఉంటే తప్ప వర్షంలో బయటకు రావద్దని, ఒక వేళ వచ్చినా తగు జాగ్రత్తలతో వెళ్ళాలని సూచించారు.