
మనతెలంగాణ/హైదరాబాద్: దేశం, రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా ఉండాలని, వర్షాలు కురిసి పాడిపంటలు స మృద్ధిగా పండాలని, కృష్ణా-, గో దావరి నదులు జలకళతో పరవ ళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్ నినో ప్రభావం తెలంగాణపై లేకుండా ఉండాలని, ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటిడి) అర్చక, సిద్ధాంతులు ఆగష్టు 10 వ తేదీన వరుణ యాగానికి మూహూర్తంగా నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు,
అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర మహాయాగం కృష్ణానది తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్ ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ మహాయాగంలో సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రకృతి అనుగ్రహం, సమృద్ధిగా వర్షాలు, కృష్ణా-గోదావరి నదుల జలసంపద పరిపుష్టి, రైతాంగ సంక్షేమం, రాష్ట్ర సుభిక్షం కోసం నిర్వహించబడుతున్న ఈ మహోన్నత వరుణయాగ మహాకార్యక్రమానికి అందరూ విచ్చేసి, యాగంలో పాల్గొని, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య ఆశీర్వచనాలను పొందాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
మహా పూర్ణాహుతిలో పాల్గొననున్న సిఎం
తెలంగాణ ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహా వరుణయాగం నిర్వహించాలని నిర్ణయించారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహా వరుణయాగం నిర్వహించడానికి ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, సిద్ధాంతులు, వేదపండితులు ఆగస్టు 10వ తేదీని శుభముహూర్తంగా నిర్ణయించారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణానది పవిత్ర తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం విజయవిహార్ ప్రాంగణంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదఘోషల మధ్య అత్యంత వైభవోపేతంగా మహా వరుణయాగం నిర్వహించ నున్నట్లు మంత్రి వెల్లడించారు. వేదవేత్తలు, అర్చక బృందం సమక్షంలో రాష్ట్ర సుభిక్షం, రైతాంగ సంక్షేమం, ప్రజల ఆయురారోగ్యాలు, పశుసంపద అభివృద్ధి, ప్రకృతి సమతుల్యత కోసం ప్రత్యేక వేదక్రతువులు నిర్వహిస్తారని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్నాం 3.24 గంటలకు జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.








