
న్యూఢిల్లీ : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను దీక్షా స్థలి నుంచి బలవంతంగా తరలించిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాను ఈ క్షణం నుంచే నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని, నిరసనకారులు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేసినంత మాత్రాన తమ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా సహా తమ ఇతర డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.











