
భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులతో పాటు వివిధ కీలక పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాను విడుదల చేసింది. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, ఆర్‌ఎస్‌ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రామ్ మాధవ్ తిరిగి బీజేపీలో కీలక సంస్థాగత పదవుల్లోకి వచ్చారు. తాజా మార్పులు చేర్పుల్లో ఆరుగురు మహిళా నేతలను జాతీయ ఉపాధ్యక్షులుగా, ముగ్గురిని జాతీయ కార్యదర్శకులుగా, ఒకరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కాగా, రామ్ మాధవ్ తిరిగి జాతీయ ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా, మాజీ మంత్రులు బిప్లవ్ కుమార్ దేబ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా,
తీరథ్ సింగ్ రావత్ జాతీయ ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, బైజయంత్ జే పాండ, రేఖా వర్మ, తారఖి మన్సూర్‌లు జాతీయ ఉపాధ్యక్షులుగా తమ పదవులను నిలబెట్టుకున్నారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగనున్నారు. బీఎల్ సంతోష్ తిరిగి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా నియమితులయ్యారు. అనిల్ ఆంటోనీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతుండగా, అనిల్ బలూని కీలకమైన నేషన్ మీడియా పాత్రను కొనసాగించనున్నారు. గత టీమ్‌లో ప్రముఖులైన దుష్యంత్ గౌతమ్, రాధామోహన్ దాస్ అగర్వాల్, సంజయ్ మయూఖ్, సరోజ్ పాండే, తేజస్వి సూర్య, లక్ష్మీకాంత్ బాజ్‌పేయి, అరుణ్ సింగ్‌కు ఈసారి చోటుదక్కలేదు.











