
అడిక్‌మెట్‌లో సిలిండర్ పేలుడు కలకలం రేపింది. అడిక్‌మెట్‌లోని వడ్డర బస్తీ, ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈరోజు రాత్రి సుమారు 8:45 గంటల సమయంలో సిలిండర్ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో సునీత (46), పుష్పలత (26) అనే ఇద్దరు మహిళలు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు నల్లకుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సౌమ్య ఆసుపత్రికి తరలించారు. సిలిండర్ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











