
ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం నలుగురు స్పిన్నర్లను భారత క్రికెట్ బోర్డు నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. స్పిన్‌కు అనుకూలించి లంక పిచ్‌లపై భారత బ్యాటర్లకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నలుగురిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. స్పిన్నర్లు విప్రాజ్ నిగమ్, తనుష్ కొటియన్, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్‌లను నెట్ బౌలర్లుగా జట్టులోకి తీసుకున్నారు. వీరందరూ జట్టుతో పాటు ఇప్పటికే శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని బిసిసిఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కాగా, లంక టూర్‌లో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలెలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరుగనుంది. అంతకుముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 7 నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ టీమ్‌తో భారత్ తలపడుతోంది. కొలంబోలో ఈ మ్యాచ్ జరుగుతుంది.











