న్యూయార్క్ మేయర్ మమ్దానీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటుగా బదులిచ్చారు. నెతన్యాహు యుద్ధ నేరగాడు, అమెరికాలో అడుగుపెడితే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్ కింద ఆయనను అరెస్ట్ చేయాలని ఇటీవల మమ్దానీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మాట్లాడుతూ.. తనను ఎవరైనా అరెస్ట్ చేస్తే అక్కడికి ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశానికి తాను తప్పకుండా హాజరవుతానని నెతన్యాహు స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పూర్తిగా అవినీతిమయమైందని కూడా ఆరోపించారు. భవిష్యత్‌లో ఇజ్రాయెల్ నేతలు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశముందని, వాటికి బెదరమని నెతన్యాహు అన్నారు. అయితే మమ్దానీ అభ్యర్థనను ట్రంప్ ఇప్పటికే తోసిపుచ్చారు. తాము నెతన్యాహును అరెస్ట్ చేయబోమన్నారు.