అందాల తార కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’. కల్తీ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, దేశవ్యాప్తంగా కల్తీ వల్ల జరిగే నష్టాలు ఏంటీ. కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుంది అనేది దానిపై ఈ సినిమా తీశామని కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో పాటు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

తనని ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు కానీ.. తన కుమారుడికి మాత్రం పాలు ఇవ్వను అని తెలిపింది. ఈ విషయంలో తనని అందరూ కసాయి తల్లి అనుకున్న సరే.. పర్లేదు అని తెలిపింది. అంతేకాక తాను ఇంట్లోనే పన్నీరు తయారు చేస్తానని కాజల్ తెలిపింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తన దేశంలో ఆహార కల్తీ విపరీతంగా ఉందని కాజల్ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఓ ప్రాజెక్టు రీసెర్చ్‌లో తాను షాకింగ్ విషయాలు తెలుసుకున్నానని.. ఇటీవల ఓ కేసు గురించి తెలిసి పుచ్చకాయ తినడం మానేశానని చెప్పుకొచ్చింది.