
ఐపిఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ 19వ సీజన్‌లో మాత్రం చెతికిలబడుతోంది. సీజన్‌లో ఇప్పటివరకూ కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్‌లో 9వ స్థానంలో స్థిరపడింది. ఇక శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమైంది. ఫలితంగా చెన్నై ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తాము మెరుగ్గా రాణించలేకపోయామని హార్థిక్ చెప్పుకొచ్చాడు.
‘‘కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.. సీజన్ మొత్తం మాకు కలిసి రాలేదు. ఈ రోజు సిఎస్‌కె అన్ని విభాగాల్లో మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఒక దశలో మా స్కోర్ ఈజీగా 190 దాటుతుంది అనుకున్నాము. కానీ, చివర్లో మెరుపులు మెరిపించలేకపోయాం. ఒకవేళ అనుకున్న స్కోర్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకే క్రీజ్‌లోకి రాగానే షాట్లు ఆడేందుకు కష్టమైంది. క్రీజ్‌లో స్థిరపడ్డ ప్రత్యర్థి బ్యాటర్లకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో మా బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారు. వాళ్లు మాకంటే బాగా బ్యాటింగ్ చేశారు’’ అని హార్థిక్ అన్నాడు.











