షాహిద్ కపూర్ హీరోగా, రష్మిక, కృతి సనన్ హీరోయన్లుగా నటించిన చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. హోమీ అదజానియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ జూన్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2026లో విడుదలై తొలి వీకెండ్‌లో రూ.50 కోట్లు దాటిన హిందీ సినిమాల్లో ‘కాక్‌టెయిల్ 2’ ఒకటిగా నిలిచింది.