లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించారు. గత నెల 11న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఒటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. విజయ్ దేవరకొండ, కెవి అనుదీప్, రాహుల్ రవీంద్ర, నివేద పేతురాజ్‌లు అతిథి పాత్రల్లో నటించారు.