న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ నిరసన దీక్ష కొనసాగిస్తుండటంతో బుధవారం రాత్రి ఉద్రిక్తతలు కొనసాగాయి. కన్నాట్ ప్లేస్‌లోని టాల్‌స్టాయ్ మార్గ్ సమీపంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిరసనకారుల పేరుతో కొందరు వ్యక్తులు జంతర్ మంతర్ సమీపంలో భద్రతా సిబ్బందిపై రాళ్లు, బాటిల్స్‌తో దాడి జరిపారు. ఈ దాడిలో కన్నాట్ ప్లేస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న సీనియర్ పోలీసు అధికారులు

వివేక్ భగత్‌ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేంత వరకూ కొద్ది నిమిషాల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. పరిస్థితి ఇంకా సెన్సిటివ్‌గానే ఉందని, గుంపును చొదరగొట్టే మిషతో కొందరు అల్లరి మూకలు అకస్మాత్తుగా పోలీసు సిబ్బంది, మీడియా వారిపై దాడులు జరిపారని అధికారులు తెలిపారు. కాగా, సంసద్ మార్గ్ వద్ద భద్రతా సిబ్బందిపై జరిపిన దాడిలో ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ గాయపడిన అధికారులు చెబుతున్నారు.


పార్లమెంటు పరిసరాల్లో భారీగా బలగాలు

సీజేపీ నిరసనలు, ఉద్రిక్తతలు చేటుచేసుకుంటున్న నేపథ్యం లో పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భ ద్రతా బలగాలను మోహరించారు.

సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను గురువారం ఉదయం 6 గంటల వరకూ నిలిపివేశారు. జంతర్ మంతర్ చుట్టుపక్కల 1.5 కిలోమీటర్ల వ రకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.