మనతెలంగాణ / సిటిబ్యూరోః ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజ్(17) అలియాస్ అజాన్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి ఫైజ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు, స్థానికంగా ఉంటున్న రౌడీషీటర్ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.