
ఢిల్లీ: సిజెపి ఆందోళనలో పెల్లెట్ గన్స్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు సముఖత వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ నిసనల్లో పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టుకోర్టు ఫైరయింది. విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్లు వాడటంపై వాడీ వేడీ వాదనలు చేశాయి. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని దాఖలైన పిటిషిన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని తెలిపింది. జూలై 20న మోహరించిన ఆర్ఎఎఫ్ ఆయుధాల లాగ్స్ భద్రపరచాలని, పెల్లెట్ గన్స్ వాడకంపై స్పష్టమైన ప్రోటోకాల్ ఉండాలని, పెల్లెట్ గన్స్ ను నిషేధించలేమని..వాడటానికి స్పష్టమైన రూల్స్ ఉండాలని ఆదేశించింది. నిరసనల్లో హింసను ప్రేరేపించేవారిని అడ్డుకోవడానికే గ్రేడెడ్ రెస్పాన్స్ విధానాన్ని అనుసరిస్తాయని, గాయపడిన బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.











