ఆర్ఎంపి వైద్యుడు దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లో చోటుచేసుకుంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఆర్ఎంపి డాక్టర్ మల్లయ్య( 57) ప్రథమ చికిత్స కేంద్రంలో ఉండగా గుర్తుతెలియని ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు తమతో తెచ్చుకున్న కారం కంట్లో చల్లి కత్తులతో దాడి చేసి పరారైయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన  మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్ఎంపి మల్లయ్యకు స్థానికంగా ఉండే కొంతమందికి కొన్ని సంవత్సరాలుగా భూమి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో కూడా అతనిపై కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతని భార్య మన్నెమ్మ గ్రామంలో కొంతమంది తమ భూమిపై కన్నేసి తన భర్తను హత్య చేయడం జరిగిందని తెలిపింది. జన సమూహంలో హత్యకు పాల్పడడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది