హైదరాబాద్: త్వరలో పెట్రోల్, డీజిల్‌, ఎల్ పిజి ధరలు పెరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్ పిజిపై రూ.50 వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 పెరిగే అవకాశం ఉంది. ఇరాన్- ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ధరల పెంపునకు ఆయిల్‌ కంపెనీల కసరత్తు చేస్తున్నాయి. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.993 చమురు సంస్థలు పెంచిన విషయం తెలిసిందే. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071 హైదరాబాద్ లో రూ.3315 కు చేరింది. ఇప్పుడు సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు కాలం వెళ్లదీయడం కష్టంగా మారుతుంది.