
నిశ్శబ్దపు నిశీధిలో
నీ జ్ఞాపకం వెలిగిన వేళ
నా గుండెలో ప్రవహించిన
జీవనదులు
ప్రతి పలకరింపునూ
ఒక ప్రేమలేఖగా మలుస్తూ
ఉదయపు చూపులా
దోబూచులాడిన నీ చిరునవ్వు
అమలిన మన స్నేహపు
అనుభూతులను భాషగా మార్చి
మాటలకన్నా ముందుగా
పలకరించుకున్న మన మనసులు
ఇక నువ్వూ నేనూ
ఈ కవిత్వపు జలపాతంలో
తనివితీరా తడుస్తూ
కాలపు అంచులదాకా
-విల్సన్ రావు కొమ్మవరపు











