
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలోని సుగాలి కాలనీలో దారుణం జరిగింది. బంధువుల మధ్య ఘర్షణతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. స్థలం విషయంలో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. బాలాజీ నాయక్ (65) అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











