
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, అఫ్గనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి ఈ రోజు (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ వార్త పంజాబ్ కింగ్స్ శిబిరాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఒమర్జాయ్‌కు అతని జాతీయ జట్టు సహచరులు, పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ వార్తని అప్గానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఒమర్జాయ్‌కు గురువుగా భావించే అస్గర్, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘అల్లాహ్ అమెకు జన్నత్ ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ ఫరిణామంతో ఒమర్జాయ్ ఐపిఎల్‌ను మధ్యలోనే వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.











