
ధర్మశాల: వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్‌కు సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే సవాల్‌గా మారింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో ఢిల్లీతో పోరు పరీక్షగా తయారైంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించిన పంజాబ్ ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ ఓటములతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతం పంజాబ్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంటోంది. అంతేగాక ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఢిల్లీకి కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ సీజన్లో ఢిల్లీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని భావిస్తోంది.














