హైద‌రాబాద్‌, జులై 18: శ‌నివారం న‌గ‌రం న‌లువైపులా హైడ్రా భారీ ఆప‌రేష‌న్లు చేప‌ట్టింది. ఒకే రోజు 840 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకుంది. మార్కెట్లో ఈ భూముల విలువ‌ రూ. 30 వేల కోట్లకు పైగా ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా చ‌ర్య‌లు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం రాయ‌దుర్గంలో 84 ఎక‌రాలు స్వాధీనం చేశారు. రాయ‌దుర్గం విలేజ్‌లోని స‌ర్వే నంబ‌రు 46లో ఉన్న ఈ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి.. పక్కనే అర ఎకరం పట్ట ల్యాండ్ లో ఈ ప్రభుత్వ భూమిలోకి చొరబడి గజాల చొప్పున అమ్మకాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకున్నారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి, హైద‌రాబాద్ జిల్లాల ప‌రిధిలో 106 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

చేసి.. కంటోన్మెంట్ ప్రాంతంలో క‌ల జీఎల్ ఆర్‌( జ‌న‌ర‌ల్ ల్యాండ్ రిజిస్ట‌ర్‌) నంబ‌రు 243, 255ల‌లో ఉన్న 106 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. మైనింగ్ కార్య‌క‌లాపాల‌తో పాటు.. వ‌ణ్య ప్రాణుల‌కు ఇబ్బంది క‌లిగిస్తూ క‌బ్జాదారుల ఆక్ర‌మ‌ణ‌లు చేయడంతో స్థానికుల ఫిర్యాదుతో పాటు రెవెన్యూ అధికారులు విన‌తి మేర‌కు రంగంలోకి హైడ్రా దిగింది. ప‌లువురు లే ఔట్లు వేసిన‌ట్టు గుర్తించిన రెవెన్యూ, హైడ్రా అధికారులు వ‌ణ్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌తో పాటు.. ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా కాకుండా ఫెన్సింగ్ వేసి హైడ్రా కాపాడుతుంది. కొండలను పేల్చుతూ.. నెమళ్ళు సంచారానికి ఆటంకాలు కల్పిస్తూ ఆక్రమణలు జరగకుండా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం బ‌హదూర్‌గూడ గ్రామంలో 650 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 1954 ఖాస్రా ప‌హాణీ ప్ర‌కారం సర్వే నంబర్లు 25, 26, ప్రభుత్వ భూమిగా న‌మోదు చేశారు. ఈ భూముల‌ను కాజేసే క్ర‌మంలో ప‌లువురు ఫామ్ హౌస్‌ల నిర్మాణం చేయగా.. ప్ర‌భుత్వ భూమిలో ప్రైవేటు వ్య‌క్తులు వ్య‌వ‌సాయం ఫామ్ హౌస్లు కట్టుకొని పలువురు బడాబాబుల ఆక్రమణలు చేయగా.. శంషాబాద్ మండ‌ల రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో హైడ్రా ఫెన్సింగ్ వేసింది.