
ఇద్దరు పోలీసులకు గాయాలు
టియర్ గ్యాస్, స్పల్ప లాఠీచార్జి ప్రయోగించిన పోలీసులు
అదనపు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపు
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తెంది. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. స్వల్పంగా లాఠీచార్జి జరిపారు. అదనపు బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.











