ఢిల్లీలో ఎపి సిఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆగస్టు 1న ప్రారంభించనున్న భోగాపురం అంతర్జా తీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ప్రధాని మోడీని సిఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపిలు, లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఎపికి సంబంధించిన కేంద్ర నిధుల విడుదల, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి లభించాల్సిన సహాయ సహకారాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. మోడీని కలిసిన తర్వాత సిఎం చంద్రబాబు కేంద్రమంత్రులు సిఆర్ పాటిల్, పీయూష్ ఘోయల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా భేటీ అయ్యారు.