
ఈ సమావేశాల్లో పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలన్న మోడీ ప్రభుత్వ బృహత్ ప్రణాళికకు ఆటంకం కలిగింది. నైతిక విలువలు కోల్పోయిన ఎంపిలను పోగుచేసే వారి నీచమైన ఆట విఫలమవడం వల్ల ఈ విధంగా జరగలేదు. ఆర్థిక వర్గాలకు, సంప్రదాయ భావజాలాలకు అతీతంగా దేశ ప్రజల ఊహలను, సానుభూతిని ఆకట్టుకున్న ఒక ఆకస్మిక ఉద్యమం శక్తి వల్ల అత్యంత బలవంతుడైన నాయకుడిగా పేరొందిన ప్రధాని నేడు ఆత్మరక్షణలో కనిపిస్తున్నారు. బిజెపికి చెందిన వయోవృద్ధ నాయకుడు మురళీ మనోహర్ జోషి కూడా తమ మద్దతును జెన్ జెడ్‌కు తెలిపారు.
స్వేచ్ఛాయుతమైన ఈ మార్పు అసంబద్ధమైన మీమ్స్, ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో, మార్కెట్ ఒత్తిళ్లు, పంపిణీ వ్యవస్థలచే పరిమితమైన సంప్రదాయ మీడియాను మించిపోయింది. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన బిల్లును తీసుకు రావడం, నందన్ నీలేకని నాయకత్వంలో పరీక్షల సంస్కరణల కోసం ఒక ‘హై-పవర్డ్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు వంటి చర్యలు కీలక సమస్యలనుండి యువత దృష్టిని మార్చలేరు. ఈ బిల్లు రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన బిల్లుకు సవరణలు మాత్రమే. రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశంపై ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను పట్టించుకోకుండా, ఇప్పుడు మరో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం ఏముంటుంది?
బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి కంచుకోట నుండి గెలుపొందడం జాతీయ రాజకీయాలలో ఓ సంచలనంగా భావించవచ్చు. కేవలం తొమ్మిది నెలల క్రితం జరిగిన ఎన్నికలలో ఆ రాష్ట్రంలో తన పార్టీని ఓ సీట్లో కూడా గెలిపించుకోలేని కిషోర్ మూడున్నర దశాబ్దాలుగా బిజెపికి తిరుగులేని నియోజకవర్గంగా పేరొందిన చోట, వరుసగా ఐదుసార్లు గెలుపొందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో జరిగిన ఉపఎన్నికలో సుమారు 20 వేల ఆధిక్యతతో గెలుపొందడం సామాన్య విషయం కాదు.
నీట్ పరీక్షా పత్రం లీక్‌కు వ్యతిరేకంగా విద్యామంత్రి రాజీనామా కోరుతూ ఢిల్లీలో సిపిజె నిరసనల అనంతరం జరిగిన ఉపఎన్నికలలో ఈ ఫలితాలు రావడంతో జెన్ జెడ్‌లో కేంద్ర ప్రభుత్వ పట్ల అసంతృప్తి పేరుకుపోతున్నట్లు భావించాల్సి వస్తుంది. అయితే స్వయంగా ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నిక ఫలితాన్ని బిజెపి తొలి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నాయకత్వం పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతకు పరిమితం చేసే ప్రయత్నం చేశారు. జాతీయ రాజకీయాలను ప్రస్తావిస్తే బిజెపి వ్యతిరేకత, ఇతర ప్రతిపక్షాలకు తనకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని ఆ విధంగా చెప్పినట్లు కనిపిస్తున్నది.
సిజెపి నిరసనల గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఈ విషయమై నేరుగా పార్లమెంట్ ముందుకు వచ్చిగాని, ప్రజల ముందుకు వచ్చిగాని మాట్లాడే సాహసం చేయడం లేదు. కేవలం అర్ధరాత్రి వీడియోల ద్వారా యువతకు సందేశాలు ఇచ్చే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారు. అయితే, ఆ సందేశాలలో యువతను ‘తప్పుదారి పట్టిన వారు’గా అభివర్ణించడం ద్వారా వారి ఆవేదనను, అసంతృప్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలేదని స్పష్టం అవుతుంది. ఈ అసంతృప్తి కేవలం నీట్ లో పరీక్షా పత్రం లీక్ కావడకు పరిమితమైనది కాదని, గత కొన్ని సంవత్సరాలుగా యువతలో నెలకొన్న అసహనాన్ని బహిర్గతం చేసిందని గుర్తించాలి. జెన్ జెడ్ పుణ్యమా అని భారత రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపు. రాహుల్ గాంధీతో సహా సంప్రదాయ రాజకీయ నాయకులు వెనుకబడిపోయి, ఉత్సాహవంతులైన, అనామక యువతరం ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు.
ఈ సమావేశాల్లో పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలన్న మోడీ ప్రభుత్వ బృహత్ ప్రణాళికకు ఆటంకం కలిగింది. నైతిక విలువలు కోల్పోయిన ఎంపిలను పోగుచేసే వారి నీచమైన ఆట విఫలమవడం వల్ల ఈ విధంగా జరగలేదు. ఆర్థిక వర్గాలకు, సంప్రదాయ భావజాలాలకు అతీతంగా దేశ ప్రజల ఊహలను, సానుభూతిని ఆకట్టుకున్న ఒక ఆకస్మిక ఉద్యమం శక్తి వల్ల అత్యంత బలవంతుడైన నాయకుడిగా పేరొందిన ప్రధాని నేడు ఆత్మరక్షణలో కనిపిస్తున్నారు. బిజెపికి చెందిన వయోవృద్ధ నాయకుడు మురళీ మనోహర్ జోషి కూడా తమ మద్దతును జెన్ జెడ్‌కు తెలిపారు. స్వేచ్ఛాయుతమైన ఈ మార్పు అసంబద్ధమైన మీమ్స్, ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో, మార్కెట్ ఒత్తిళ్లు, పంపిణీ వ్యవస్థలచే పరిమితమైన సంప్రదాయ మీడియాను మించిపోయింది. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన బిల్లును తీసుకు రావడం, నందన్ నీలేకని నాయకత్వంలో పరీక్షల సంస్కరణల కోసం ఒక ‘హై-పవర్డ్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు వంటి చర్యలు కీలక సమస్యలనుండి యువత దృష్టిని మార్చలేరు.
ఈ బిల్లు రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన బిల్లుకు సవరణలు మాత్రమే. రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశంపై ఏర్పాటు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను పట్టించుకోకుండా, ఇప్పుడు మరో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం ఏముంటుంది? ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించమని రెండేళ్ల క్రితమే ఆ కమిటీ సిఫార్సు చేయగా, ఇప్పుడు వచ్చే ఏడాది నుండి నిర్వహిస్తామని చెబుతున్నారు. దానితో ప్రభుత్వ నిజాయతీపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్ రాజకీయ ప్రచారం నిర్వహించి, 2013లో యువతను ఆకట్టుకోవడం ద్వారా 2014లో ప్రధాన మంత్రి పదవిని మోడీ చేపట్టగలిగారు. అయితే తనకు మద్దతు ఇచ్చిన యువత ఇప్పుడు 30 నుండి 35 ఏళ్ళ వయస్సులో ఉన్నారు. వారిలో రగిల్చిన ఆశలు, భరోసాలు ఏమాత్రం నెరవేర్చామనే ఆత్మపరీక్ష చేసుకోవడం నేడు అత్యవసరం. జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపిన జెన్ జెడ్ ఆందోళనద్వారా తమ రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు, మరొకొన్ని సమూహాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ, ప్రధాని మోడీ మెడ వంచి, విద్యామంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తేగల సామర్ధ్యం వారిలో లేదని గ్రహించాలి. సిజెపి మొదట్లో నిరసనలు ప్రారంభించిన్నప్పుడు, సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మూడు వారల వరకు పెద్దగా స్పందన లేదు. జాతీయ మీడియా, రాజకీయ పక్షాలు కూడా పట్టించుకోలేదు. కానీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆందోళనకు మద్దతు పెరుగుతూ వచ్చింది. రాజకీయాలకు, భావజాలాలు, ప్రాంతీయ పరిమితులకు అతీతంగా యువతలో ఆందోళన చెలరేగింది. పలువురు బిజెపి నాయకుల పిల్లలు సైతం సంఘీభావం తెలపడం గమనార్హం.
తమ విద్య, ఉపాధి అవకాశాలు మృగ్యం అవుతూ ఉండటం, ద్రవ్యోల్బనం, పాలనా యంత్రాంగాలలో పేరుకుపోతున్న అవినీతి, అవినీతిపరులు రాజకీయాలలో ఆధిపత్యం వహిస్తూ ఉండటం, విలువలకు ప్రజాజీవనంలో విలువ లేకపోవడం వంటి పరిణామాలు యువతలో అంతులేని అశాంతిని కలిగిస్తున్నాయి. నేటి జెన్ జెడ్ కు యుపిఎ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి తెలియదు. అన్నా హజారే ఉద్యమం గురించి తెలియదు. ఎమర్జెన్సీ గురించి, నెహ్రూ విధానాల గురించి అసలే తెలియదు. వారికి తెలిసింది కేవలం 2013 నుండి ప్రధాని మోడీ ఇస్తున్న భరోసాలు, ఆయన పాలనలో అమలు చేస్తున్న విధానాలు మాత్రమే. నేటి మోడీ ప్రభుత్వంలో పలువురు మంత్రులు, బిజెపిలో పలువురు కీలక నాయకులు గతంలో ఎబివిపిలో, యువమోర్చాలో కీలక నాయకులుగా వ్యవహరించినవారే. పలు విద్యార్థి, యువజన ఉద్యమాలు నిర్వహించినవారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా విద్యార్థ్ది నాయకురాలిగా రాజకీయాలలో దూసుకు వచ్చారు. ఎబివిపి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఉద్యమం. అయితే, నెల రోజులకు పైగా జంతర్ మంతర్ వద్ద, దేశంలోని పలు ప్రాంతాలలో విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటే వారితో సంభాషణలు జరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయలేకపోయారు.
ఓ పరిష్కారం దిశగా మార్గం ఏర్పడితే తప్ప కేంద్ర మంత్రులు నేరుగా సిజెపి శిబిరం వద్దకు వెళ్లి సంప్రదింపులు జరపలేదు. అయితే, విద్యార్థ్ది, యువజన నాయకులుగా ఎంతో అనుభవం ఉన్న ఇతరులు వారితో అనధికారికంగా సంప్రదింపులు జరిపి, ఓ రాజీ మార్గాన్ని ఎందుకు కనుగొనలేకపోయారు? అనే ప్రశ్నలే బంకీపూర్ ఉపఎన్నిక ఫలితంకు సమాధానాలుగా భావించాల్సి వస్తుంది. చివరకు నిరసనకారుల రాజీపడని డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకూడదనే తన గందరగోళపు మొండితనంతో ప్రధాని మోడీ తన ప్రభుత్వాన్ని, వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంగా చరిత్ర పాఠాలను గుర్తుచేసుకోవాలి. జవహర్‌లాల్ నెహ్రూ కూడా కృష్ణ మీనన్ తన మంత్రివర్గం నుండి వైదొలగడానికి బలవంతంగా అంగీకరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ రాజీనామా చేయాలన్న విద్యార్థుల డిమాండ్‌కు ఇందిరా గాంధీ అయిష్టంగానే తలొగ్గారు, రక్షణ మంత్రి పదవి నుండి వైదొలగమని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జార్జ్ ఫెర్నాండెస్‌ను కోరారు. రాజకీయాలలో పట్టువిడుపులు సర్వసాధారణం. వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకోకుండా విశాలమైన అంశాలను పరిగణలోకి తీసుకొని, నిజాయితీతో వ్యవహరిస్తేనే జెన్ జెడ్ అసంతృప్తికి పరిష్కారం కనుగొనగలరు.
చలసాని నరేంద్ర
98495 69050











