బీజింగ్: చైనా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో పివి సింధు శుభారంభం చేసింది. యంగ్ షట్లర్ ఉన్నతి హుడాపై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు పురుషుల విభాగంలో ఆయుష్ శెట్టి.. వరల్డ్ 11వ ర్యాంకర్ అల్వి ఫర్హాన్(ఇండోనేషియా)ను 2117, 521, 2117 ఓడించి రెండో రౌండ్‌కు చేరగా, మరో స్టార్ షట్లర్ జపాన్‌కు చెందిన ఆటగాడు యుషి తనకపై 2220, 1521, 2114 తేడాతో చెమటోడ్చి విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు.. ఉన్నతి నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. ఇటీవలె జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సింధు, 18 ఏళ్ల ఉన్నతితో జరిగిన పోరులో 56 నిమిషాల హోరాహోరీ సాగించి 21-14, 9-21, 21-10 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో ప్రారంభం నుంచే గట్టి పోటీని ఎదుర్కొన్న స్టార్ షట్లర్ అద్భుత ఆటతీరుతో వరుసగా ఐదు పాయింట్లు సాధించి 12-8 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరకు 21-14తో ఆ గేమ్‌ను కైవసం చేసుకుంది. అనంతరం ఉన్నతి చేతిలో చిత్తయి, 921తో గేమ్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తొలి నుంచే దూకుడైన ప్రదర్శనతో క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ స్కోరును 6-3 నుండి 10-5, ఆపై 15-8కి చేర్చింది. చివరకు 21-10తో విజయం సాధించి బీఎండబ్ల్యూ సూపర్ 1000 టోర్నమెంట్‌లో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.