
మల్టీ టాలెంటెడ్ జి.వి.ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ’ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్‌కి అదిరిపోయే స్పందన వచ్చింది. తాజాగా ’ఇమ్మోర్టల్’ నుంచి రొమాంటిక్ మెలోడీ ’షీ ఈజ్ మై’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సామ్ సీఎస్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అరవింద్ శ్రీనివాస తన గాత్రంతో పాటకు ప్రాణం పోయగా, రాజశ్రీ సుధాకర్ రాసిన సాహిత్యం ప్రేమలోని భావోద్వేగాలను అందంగా పలికించింది. ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా ఆసక్తికరంగా ఉంది.











