
హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పెద్ది’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై పలు విమర్శలు వచ్చాయి. దీంతో బుచ్చిబాబు క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఆదివారం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ఎక్కడ పెళ్లి జరిగినా ఎవడో ఒకడు వచ్చి, ‘ఇది బాగోలేదు.. అది బాగోలేదు’ అని అంటాడు. అవన్నీ చిన్న చిన్న విషయాలు. నాది ‘పెద్ది’ తరహాలో పోరాడే పాత్ర’’ అని అన్నారు.
‘‘పెద్దిలో యాడ్ చేసే సీన్స్ బుధవారం నుంచి థియేటర్లలో ప్రదర్శితమవుతాయి. కథానాయిక జాన్వీ కపూర్‌తో పాటు, జగపతి బాబుకు సంబంధించిన సన్నీవేశాలు యాడ్ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారు. నాలుగైదు శాతం మంది మాత్రమే అసలు కథ కాకుండా వేర్వేరు అంశాలు మాట్లాడారు. 95 శాతం మంది సినిమాలోని క్రీడా స్పూర్తి, చరణ్‌గారి నటనను ప్రశంసించారు. ఏ థియేటర్‌కు వెళ్లినా అలాంటి స్పందనే ఉంది’’ అని బుచ్చిబాబు అన్నారు.











