
రాఖీ పౌర్ణమి వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, టికెట్ ధరలను భారీగా పెంచడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పండుగ పూట తమ స్వగ్రామాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులకు ఈ అదనపు ఛార్జీల బాదుడు భారంగా మారింది. రాఖీ పండుగను పురస్కరించుకుని ఆగస్టు 27 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు వేల ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న విషయం తెలిసిందే. అ యితే, ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి జడ్చర్లకు సాధారణ ఛార్జీ రూ. 150 ఉండగా, ప్రత్యేక బస్సుల్లో దానిని రూ. 190కి పెంచారు. కరీంనగర్‌కు వెళ్లే సూపర్ డీలక్స్ బస్సులో సాధారణ టికెట్ ధర రూ. 300 ఉం డగా, ప్రస్తుతం రూ. 400 వసూలు చేస్తున్నారు. ఛార్జీల పెంపుపై ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్సు ఎక్కిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ధరల పెంపుపై ముందే ప్రకటన విడుదల చేస్తే బాగుండేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.
చార్జీల పెంపు వెనుక కారణాలు..
టికెట్ ధరల పెంపుపై టీజీఎస్‌ఆర్టీసీ పీఆర్‌వో ప్రసన్న వివరణ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో జా రీ చేసిన జీవో నెంబర్ 16ప్రకారం ఆర్టీసీకి ఒక ప్రత్యేక వెసులబాటు కల్పించారని చెప్పారు. పండుగ రద్దీని తట్టుకోవడానికి నడిపే ప్రత్యేక బస్సులు టికెట్ ధరలను సాధారణ ధర కంటే గరిష్టంగా 50 శాతం వరకు పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి ఉందని ప్రసన్నకుమార్ స్ప ష్టం చేశారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి పల్లెటూళ్లకు వెళ్లేటప్పుడు బస్సులు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోతా యి. కానీ అవే బస్సులు తిరిగి వచ్చేటప్పుడుప్రయాణికులు లేక ఖాళీగా రా వాల్సివుంటుంది. ఆ తిరుగు ప్రయాణానికి అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, కా ర్మికుల అదనపు బత్తా, నిర్వహణ వ్యయాన్ని భర్త చేసుకోవడానికి ఈ అదన పు చార్జీలు వసూలుకు ప్రభుత్వం చట్టబద్దంగా అనుమతినిస్తుందని వివరించారు. అయితే ఈ చార్జీల పెంపు సాధారణ బస్సులకు వర్తించవు.. ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తుందని ప్రసన్నకుమార్ తెలిపారు.











