అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం పాలయ్యాడు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి(26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణిం చినట్లు వైద్యులు నిర్ధారించారు. అమెరికాలో నిత్యానంద రెడ్డి ఎంఎస్ పూర్తి చేశాడు. మిషిగన్ స్టేట్‌లోని డెట్రాయిట్‌లో ఉంటున్న నిత్యానంద రెడ్డి ఈ నెల 18న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో నిత్యానందరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితు లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

జులై 23న నిత్యా నంద రెడ్డి బర్త్‌డే కావడంతో అతని స్నేహితులు ఆసుపత్రి బెడ్ పైనే యువకుడు పుట్టిన రోజు వేడు కలు నిర్వహిం చారు. పరిస్థితి విష మించడం తో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. పుట్టినరోజు నాడే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీర య్యారు. ఎమ్మెస్ చేసేందుకు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. మృత దేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈ వార్త తెలియడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి.