టాలీవుడ్‌లో ఆగస్టు నెలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ నెలలోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్‌బాబు బర్త్‌డేలు ఉంటాయి. ఈ నెల అభిమానులకు నిజంగా పండుగలా మారుతుంది. అయితే ఈ సారి టాలీవుడ్ అగ్ర హీరోల పుట్టినరోజులు రావడం మాత్రమే కాకుండా అదే సమయంలో వారి ప్రతిష్టాత్మక సినిమాల నుంచి వచ్చే క్రేజీ అప్డేట్స్ ఇండస్ట్రీలో సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ వంటి దిగ్గజ హీరోల బర్త్ డేలు ఆగస్టు మాసంలో తెలిసిందే. సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలతో సరిపెట్టకుండా మేకర్స్ సైతం ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని వారు నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్‌ల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌ను ప్లాన్ చేశారు.

విభిన్న కథాంశాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రాల నుంచి వచ్చే టీజర్లు, పోస్టర్లు, గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆరోజు విశ్వంభర సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ ఉంటుంది. అలాగే సెట్‌లో ఉన్న బాబీ సినిమా విషయాలను కూడా చిరంజీవి లీక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండింటితో పాటు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ అప్‌డేట్ కూడా ఉంటుంది.

ఇక మహేష్ బర్త్ డే ఆగస్టు 9 కావడంతో వారణాసి సినిమా నుంచి ఆసక్తికరమైన అప్ డేట్ కచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి తన హీరో బర్త్ డేని క్రేజీగా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక నాగార్జున బర్త్ డే ఆగస్టు 29 కావడంతో? ఆ రోజు కచ్చితంగా ఆయన వందవ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లేకుండా బర్త్ డే ఉండదు. అలాగే కొత్త సినిమా విశేషాలు కూడా ఆరోజును లీక్ చేసే అవకాశం ఉంది. ఇలా ముగ్గురు స్టార్ హీరోలు ఒకే నెలలో తమ సినిమాల విశేషాలను పంచుకోవడం ఇదే తొలిసారి కావచ్చు.