కరీంనగర్: ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చిన ఎపి డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కేసు పెట్టడం చేతకాని ప్రభుత్వం తెలంగాణలో ఉందని విమర్శించారు. టిఆర్‌ఎస్ జిల్లా శాఖ అధ్శవవర్యలో ఏర్పాటు చేసిన పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని ప్రాధాన్యత లేని అంశంగా భావిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక పలువురు నేతలు తెలంగాణ భావజాలంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమానికి అండగా నిలిచిన కరీంనగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ప్రజల త్యాగాలను అవమానించినట్లే అని అన్నారు.