యాదాద్రి భువనగిరి: భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో హేజోలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలయ్యాయి. పేలుడు కారణంగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతోన్నాయి. పొగ దట్టంగా అలముకుంది. మూడు నెలల వ్యవధిలో కంపెనీలో రియాక్టర్ రెండోసారి పేలింది. కంపెనీ నుంచి విష రసాయనాలు వెలుబడుతోన్నాయి. ఘాటైన వాసన వెదజల్లడంతో సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దోతిగూడెం, అంతమ్మగూడెం వరకు రసాయనాల ఘాటు వ్యాపించింది ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కూడా రసాయనాలు లీక్ అవుతుండటంతో పెద్ద ఎత్తున వ్యాపిస్తోన్నాయి.