ఇకామార్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఓటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. తన ప్లస్ లాయల్టీ మెంబర్లకు నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా మొబైల్‌ప్లాన్ అందించాలని నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి క్తొగా రివార్డ్ పథకాన్ని ప్రారంభించాలని, దాన్ని నెలవారీ షాపింగ్ ఆధారంగా వర్తింప చేయనున్నట్లు శుక్రవారంనాడు ప్రకటించాయి. నెలలో నాలుగు సార్లు రూ.299, ఆ పైన అధికంగా షాపింగ్ చేసిన వారికి ఇది ఉచితంగా లభించనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో షాపింగ్ చేయాల్సి ఉంటుంది. నాలుగో ఆర్డర్ పూర్తి కాగానే నెల రోజుల పాటు మొబైల్ ప్లాన్ అమల్లోకి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సభ్యులు కాని వారు కూడా ఈ మొబైల్ ప్లాన్‌కు అర్హులేనని ప్రకటించాయి.