
హైదరాబాద్: సినీ నటి రష్మిక మందన్న ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ న్యూస్. సినిమా షూటింగ్‌లో రష్మిక గాయపడ్డారు. షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు హీరోయిన్ ప్రాధాన్యమున్న ‘మైసా’లో లీడ్ రోల్ చేస్తుంది.











