డ్యూటీలో ఉన్న పోలీసును ఓ కోతి సరదాగా ఆటపట్టించింది. పోలీసు భుజంపైకి ఎక్కిన కోతి.. అక్కడే కాసేపు హంగామా చేసింది. అంతేకాదు.. పోలీసు తలలో పేలు చూస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అక్కడితో ఆగకుండా.. మరో ఎస్ఐ జేబులోని పెన్నును లాక్కుని చక్కగా అక్కడి నుంచి పారిపోయింది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన నవ్వులు పూయిస్తోంది.