మన తెలంగాణ/ కందుకూరు: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తుందని నగర అభివృద్ధిలో ప్రగతి సాధించడానికి రాజకీయాలకతీతంగా కలిసి నడువాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నా రు. జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని రూ.87 కోట్ల సీఆర్‌ఎఫ్ నిధులతో శ్రీశైలం హైవే అవేర్ హాస్పిటల్ నుంచి లేమూరు మీదుగా తిమ్మాపూర్ వరకు 38 కోట్లు, బేగంపేట్ గ్రామం నుంచి ఎలిమినేడ్ వరకు 17 కొట్లు, మీర్‌ఖాన్‌పేట్ నుంచి కొంగరకలాన్ వరకు రూ.32 కోట్లతో నిర్మిస్తున్న రోడ్ల పనులకు శుక్రవారం లేమూరు, బేగంపేట్, తిమ్మాపూర్‌లలో రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డిలతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తె లంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రితో ఎల్లప్పుడూ చర్చిస్తుంటానని అందులో భా గంగానే దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రానికి 3 హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లలో హైదరాబాద్ పుణె, హై దరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మా ర్గాలలో ఏర్పాటుకు ప్రాథమిక అంచనా వ్యయం సుమారు రూ.5 లక్షల కోట్లు కాగా భూసేకరణలో తలెత్తే సమస్యల దృష్టా వ్యయం 10 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సర్వే డీపీఆర్‌లు పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ బుల్లెట్ ట్రైన్ల నిర్మాణంతో పాటు హైదరాబాద్ వ్యయంతో మరో రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టే దిశగా అడుగులు సాగుతున్నాయని దీంతో తెలంగాణ రాష్ట్రం గేమ్‌ఛేంజర్‌లా మారబోతుందన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాల్లో రహదారుల నిర్మాణం, విద్యుత్, సాగునీటి సౌకర్యాలు చేపట్టడం వల్ల మరిన్ని మౌలిక సదుపాయాలతో గ్రామాల అభివృద్ధి మరింత వేగంవంతమై రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృత అవకాశాలు ఏర్పడుతాయన్నారు. అ

నంతరం స్వగ్రామంలో నిర్వహించిన శ్రీ శివరామాంజనేయస్వామి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హో మంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర శివారు ప్రాంతాల ప్రజలకు రోడ్ల అనుసంధానం వల్ల అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ఉపాధి, వ్యాపార రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించడం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్, బేగంపేట్, లేమూరు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు. రోడ్ల నిర్మాణానికి రూ.87 కోట్లు కేటాయించి చేపట్టడం అభినందనీయమని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల అనుసంధానానికి రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేఎల్‌ఆర్, బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.