బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ నితేష్ తివారీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'రామాయణ పార్ట్ 1' ట్రైలర్ వచ్చేసింది. గురువారం(జూలై 30) ఉదయం మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రాముడు, సీత, రావణుడు, శూర్పణఖ, ఇతర కీలక పాత్రలను పరిచయం చేశారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామానంద్ సాగర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. ట్రైలర్‌లో రణబీర్ శిక్షణా దశలు, ముఖ్యంగా విలువిద్యలో ఆయన నైపుణ్యం, ప్రావీణ్యం కనిపిస్తాయి. అలాగే, సీతాదేవి స్వయంవర ఘట్టం కూడా ఇందులో చూపించారు. సీతాదేవిగా సాయిపల్లవి నటించారు. దశరథ మహారాజుగా అరుణ్ గోవిల్, ఆయన భార్య కైకేయి పాత్రలో లారా దత్తా, మంథర పాత్రలో షీబా చద్దా నటించగా.. యశ్ రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్ నటిస్తున్నారు. ఆయన సోదరి శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇక..రాక్షస యువరాజు, శూర్పణఖ భర్త అయిన విద్యుజ్జిహ్వుడి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నారు. నటి శోభన రావణుడి తల్లి కైకసి పాత్రను పోషిస్తున్నారు.