మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) తాజాగా ని ర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన ల భించింది. రాయదుర్గ్‌లోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ -పీ2ను ఎకరాకు రూ.269 కోట్ల ధ రకు వేలం వేయగా మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం లభించింది. ఇదే క్రమంలో గత వారం నిర్వహించిన ప్లాట్- పీ1 వేలం కూడా అత్యంత భారీ ధరను నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకగా మొత్తం రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో వేలం విలువలో 25శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకుం ది.

తాజాగా నిర్వహించిన పీ2 వేలం ఫలితాన్ని, గత వారం పీ1 వేలం ఫలితాన్ని కలిపి చూస్తే కే వలం 10.63 ఎకరాల భూమి ద్వారా టీజీఐఐసీకి ఏకంగా రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ 2 వేలాల్లో ఎకరాకు సగటున రూ.266.53 కో ట్ల ధర లభించడం విశేషంగా ప్రభుత్వం పేర్కొం ది. ఈ సందర్భంగా టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. శశాంక మాట్లాడుతూ హైదరాబాద్‌లో పెట్టుబడిదారుల విశ్వాసానికి తాజా వేలం బలమైన నిదర్శనమని అన్నారు. రాయదుర్గ్ ప్రాంతం అత్యుత్తమ వ్యాపార, పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతున్న విషయాన్ని ఈ వేలం మరోసారి నిరూపించిందని తెలిపారు. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాల్లో ఉన్న భూములకు ఎంతటి డిమాండ్ ఉందో ఈ ధరలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.