స్లొవేకియా: అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు వచ్చాయి. మాన్సి లాథర్ రజత పతకాన్ని.. తన్వీ మగ్దుమ్, కోమల్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 68 కెజిల విభాగం స్వర్ణ పతక పోరులో చైనాకు చెందిన చెన్‌లింగ్ సాంగ్ చేతిలో మాన్సి 1-2 స్వల్ప తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టకుంది. 57 కెజిల విభాగంలో తన్వీ 10-4తో అగ్నియా (కెనడా)ను కాస్య పతకం దక్కించుకుంది. 59 కెజిల విభాగంలో కోమల్ 5-2తో ఎడా బాలజ్‌(హంగేరీ)ని చిత్తు చేసింది. ఈ టోర్నీలో శుక్రవారం 76 కెజిల విభాగం ఫైనల్‌లో కాజల్ దోచాక్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. తను శర్మ (72 కెజిలు), సవిత (62 కెజిలు) రజతం దక్కించుకున్నారు.