
హైదరాబాద్: రక్తదానం పట్ల సమాజంలో చైతన్యం కలిగిస్తూ, నిరంతరం అమూల్యమైన సేవలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా సంస్థలు, స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతున్న ప్రతి రక్తదాతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ప్రపంచ రక్తదాన దినోత్సవం” సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రక్తదానం ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నత మానవతా సేవ అని, ఒకరి రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడుతుందని, వారి కుటుంబంలో కొత్త ఆశలను నింపుతుందన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడే మహత్తర కార్యంలో భాగస్వాములై ప్రాణదాతలుగా నిలవాలని ముఖ్యమంత్రి ఒక సందేశంలో వివరించారు.











