యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జాతీయ జట్టులో టి-20ల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడిని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ ఆటగాడు ఫారూక్ ఇంజనీర్ అభిప్రాయపడ్డారు. రోహిత్‌కు జోడీగా వైభవ్‌ను ఓపెనర్‌గా పంపించి శుభ్‌మాన్ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని సూచించారు. దీంతో మిడిలార్డర్ బలంగా మారుతుందని పేర్కొన్నారు.

‘‘గిల్ ఒక క్లాస్ ప్లేయర్. ప్రస్తుతం జట్టులో అతనే అత్యుత్తమ బ్యాటర్ అని నా అభిప్రాయం. అయితే శుభ్‌మాన్ ఆరంభంలోనే దూకుడగా ఆడే రకం కాదు. వన్డేల్లో ఎడమ, కుడి చేతి వాటం కాంబినేషన్ బాగుంటుంది. రోహిత్‌కు జోడీగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన వైభవ్‌ను పంపాలి. వైభవ్ దూకుడుగా ఆడుతుంటే మరో ఎండ్‌లో రోహిత్ ఎక్కువగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండటానికి ప్రయత్నిస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ బ్యాట్‌కి పని చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మూడు, గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావాలి. అప్పుడు బ్యాటింగ్ లైనప్ పటిష్టం అవుతుంది’’ అని ఫారూక్ అన్నారు.