చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటు పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శనివారంనా డు టివికె అధినే విజయ్ సిఎంగా ప్రమాణ స్వీకా రం చేస్తారని అంతా అనుకుంటున్న తరుణంలో పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్ నాయకత్వలోని టివికె కు ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఇప్పటికే మ ద్దతు ప్రకటించగా నలుగురు నలుగురి సభ్యుల బ లం ఉన్న వామపక్షాలు, ఇద్దరేసి సభ్యులతో కూడి న విసికె, ఐయుఎంఎల్ శుక్రవారం మధ్యాహ్నం కల్లా మద్దతు పలికాయి. దీంతో విజయ్‌కు ప్రభు త్వ ఏర్పాటుకు సరిపడా మేజిక్ ఫిగర్ 118కి చేరడంతో శుక్రవారంనాడు సాయంత్రం ఆయన తన పార్టీ నేతలతో వెళ్లి గవర్నర్ అర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు  ఆహ్వనించాలని కోరారు.

కాంగ్రెస్‌తో పాటు లెఫ్ట్ మద్దతు లేఖ కూడా ఆయనకు అందజేశారు. కాసేపట్లో మిగతా రెండు పార్టీల లేఖలు కూడా మీకు అందుతాయని గవర్నర్‌కు తెలిపారు. అయితే సివికె తమ మద్దతు లేఖను గవర్నర్‌కు పంపించలేదు. ఉదయం మద్దతు ప్రకటించిన ఐయుఎంల్ రాత్రికల్లా ప్లేటు ఫిరాయించింది. టివికెకు తాము మద్దతు తెలపడం లేదని ఖరాఖండిగా ప్రకటించింది. విసికె ఇంకా వైఖరి తేటతెల్లం చేయలేదు. దీంతో విజయ్ బలం 116 వద్దనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. టివికె, కాంగ్రెస్, వామపక్షాలు కలిపి 116 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. మిగతా రెండు పక్షాలు గవర్నర్ అర్లేకర్‌కు అధికారికంగా లేఖ రాయకపోవడంతో సరిపడా బలం లేదని గవర్నర్ నమ్ముతున్నారని, ఆ నేపథ్యంలో అధికారికంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని లోక్‌భవన్ వర్గాలు శుక్రవారంనాడు రాత్రి ‘ఇండియా టుడే’కు తెలిపారు.

వామపక్షాల కార్యాలయాలకు విజయ్

ప్రభుత్వ స్థాపనకు గవర్నర్ సమ్మతించిన తరువాత విజయ్ ముందుగా రాష్ట్రంలోని వామక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు,. తన కారులోనే చెన్నైలోని సిపిఐ, సిపిఎం కార్యాలయాలకు వెళ్లారు. అక్కడి నేతలకు ధన్యవాదాలు పలికారు. తమకు మద్దతు ఇచ్చి వారి ఉదారత చాటారని తెలిపారు. వామపక్షాల ఆఫీసులకు విజయ్ వెళ్లడం ఇదే తొలిసారి. అంతకు ముందు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం వీరపాండ్యన్ స్పందించారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించారు. వీరే హీరోలు, వారికి తాము మద్దతు ఇచ్చామని తెలిపారు. అయితే ఇతర అంశాలు, రాష్ట్ర హక్కుల కోసం పాటుపడుతామని తెలిపారు.డిఎంకెతో స్నేహం కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం తెలిపారు.