భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్లో రూ.15 లక్షల కంటే తక్కువ ధరకే అనేక ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీలు ఈ బడ్జెట్‌లో అనేక ఎంపికలను అందిస్తున్నాయి. ఈ ఎస్‌యూవీలలో ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్‌లు, వెంటిలేటెడ్ సీట్లు (కూల్డ్ సీట్లు) ADAS వంటి సెఫ్టి ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 లక్షల లోపు కొత్త ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మార్కెట్లో అనేక ఎంపికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


కియా సోనెట్

భారతదేశంలో రూ.15 లక్షల లోపు ఎస్‌యూవీ విభాగంలో అత్యంత సరసమైన ఎంపికలలో కియా సోనెట్ ఒకటి. ఇది 82bhp,115 Nm ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లేదా 118 bhp, 172 Nm ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ (iMT) లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. కియా సోనెట్‌లో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో 1.5-లీటర్ (114.4 bhp/250 Nm) ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్, iMT, లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (AT) ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. కాగా, దీని బేస్ వేరియంట్ ధర రూ.7.32 లక్షలు నుండి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్

రూ.15 లక్షల లోపు కొనుగోలుదారుల కోసం మరో ఫీచర్-రిచ్ ఎస్‌యూవీ నెక్సాన్. 2017లో లాంచ్ అయినా ఈ వాహనం కాలక్రమేణా అనేక అప్‌గ్రేడ్‌లు, కొత్త ఎడిషన్‌లు, ఫేస్‌లిఫ్ట్‌లతో మార్కెట్లోకి వస్తోంది. ఇది ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా ICE వేరియంట్‌లో ఈ టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీలోని 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 118 bhp, 170 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది బహుళ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. వీటిలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎమ్‌టి, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి) ఉన్నాయి. కాగా, దీని బేస్ వేరియంట్ ధర రూ.7.37 లక్షలు నుండి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి బ్రెజ్జా

మారుతి సుజుకి బ్రెజ్జా ధర బేస్ వేరియంట్ ధర రూ.8.26 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 102 bhp, 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయవచ్చు.

హ్యుండాయ్ క్రెటా

హ్యుండాయ్ క్రెటా రూ.15 లక్షల లోపు ధర కలిగిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో అందిస్తుంది. క్రెటా ఐసిఇ మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (113 బిహెచ్‌పి, 144 ఎన్ఎమ్), 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ (158 బిహెచ్‌పి, 253 ఎన్ఎమ్) 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (114 బిహెచ్‌పి, 250 ఎన్ఎమ్). దీని ధర రూ.10.79 లక్షలు.

మహీంద్రా స్కార్పియో-ఎన్

మహీంద్రా అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్. తక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన వాహనం కోసం చూస్తున్న వారికి ఒక గొప్ప ఎంపిక కావచ్చు. ఈ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్. దీని ధర రూ.13.49 లక్షలు.