
హైదరాబాద్: రూ.2 వేల కోట్ల స్కామ్ ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. స్కామో జరిగిందని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. "ప్లేస్ నువ్వే చెప్పు.. నేను.. మా అధికారులంతా వస్తాం.. స్కామ్ నిరూపించకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతావా హరీష్ రావు?" అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
అంతకుముందు, ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2000 కోట్ల స్కామ్ చేసిందని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.











